CPI Narayana: మోటార్లకు మీటర్లు పెడితే వేళ్లు నరికేయండి: సీపీఐ నారాయణ

‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే.. వాటిని పెట్టేందుకు వచ్చిన అధికారులు, సిబ్బంది వేళ్లు నరికేయండి’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో బుధవారం జిల్లా రైతు సదస్సులో

Updated : 29 Sep 2022 06:51 IST

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: ‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే.. వాటిని పెట్టేందుకు వచ్చిన అధికారులు, సిబ్బంది వేళ్లు నరికేయండి’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో బుధవారం జిల్లా రైతు సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు రాజశేఖరరెడ్డి ప్రయత్నిస్తే దానిని కాదని సీఎం జగన్‌ మీటర్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజన్న పాలన తెస్తానని చెప్పి గద్దెనెక్కిన జగన్‌ విద్యుత్తు మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మీటర్లు బిగిస్తే పగులగొట్టాలని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీకెందుకు భయమని జగన్‌ను ప్రశ్నించారు. నిజాం పాలనలో నిజాం నవాబు వస్తే సైన్యం అంతా రాజు వచ్చారు.. దూరంగా వెళ్లాలని అనేవారని, అంతకుమించి వందల సంఖ్యలో పోలీసు బందోబస్తుతో సీఎం జగన్‌ తిరుమల పర్యటన జరిగిందని విమర్శించారు. విమానాశ్రయం నుంచి తిరుమల వరకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా వేల సంఖ్యలో పోలీసులు కాపలా కాశారని, సీఎంకు ఎందుకింత అభద్రతా భావమని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని