ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలను పూర్తిగా పొందుపర్చలేదని దాఖలైన పిటిషన్‌లో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Published : 29 Sep 2022 04:43 IST

ఈనాడు, దిల్లీ: ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలను పూర్తిగా పొందుపర్చలేదని దాఖలైన పిటిషన్‌లో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రాజాసింగ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలను పొందుపర్చలేదంటూ ఆయనపై తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో సరైన వివరాలు లేవంటూ రాథోడ్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ జేబీ పార్ధీవాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వినయ్‌ నవ్రే వాదనలు వినిపించారు. ఎన్నికైన అభ్యర్థిపై(రాజాసింగ్‌) ఎనిమిది క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, రెండింటిలో ఛార్జిషీట్‌ దాఖలైందని తెలిపారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రాజాసింగ్‌, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. రాజాసింగ్‌ నవంబరు 1లోపు, ఇతర ప్రతివాదులు తదుపరి విచారణలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ధర్మాసనం తదుపరి విచారణ సమయానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను దీపావళి సెలవుల తర్వాత చేపట్టనుంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని