కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప

రాష్ట్రాన్ని ప్రజలు సీఎం కేసీఆర్‌ చేతుల్లో పెడితే.. ఆయన రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. బుధవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌

Published : 29 Sep 2022 04:43 IST

సీఎంపై షర్మిల ధ్వజం

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని ప్రజలు సీఎం కేసీఆర్‌ చేతుల్లో పెడితే.. ఆయన రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. బుధవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలో ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలో  బహిరంగసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చింది చాలదన్నట్లు దే¸శం మీద పడ్డారని దుయ్యబట్ట్టారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదని, తొలి క్యాబినెట్‌లో ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఇక్కడ మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదన్నారు. ఈ పాపాలు కప్పిపుచ్చుకునేందుకే బతుకమ్మ చీరలంటూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 59 ఏళ్లు దాటిన వారికీ రైతుబీమా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు కళ్లముందు కనిపిస్తుండగా.. 17వేల పోస్టులు భర్తీ చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. వీఆర్‌ఏలు 66 రోజులుగా సమ్మె చేస్తున్నా కనికరించడంలేదని, వారికి పదోన్నతులంటూ హామీ ఇచ్చి మోసం చేయడంతో 35 మంది చనిపోయారని పేర్కొన్నారు. తెగేవరకు లాగొద్దని వీఆర్‌ఏలను మంత్రి కేటీఆర్‌ హెచ్చరించడం తగదన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts