రేపే ఆఖరు.. అయినా అదే తకరారు

నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనున్నా ఇప్పటికీ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరెవరనేది తేలడం లేదు. రాజస్థాన్‌లో

Updated : 29 Sep 2022 05:32 IST

ఐసీసీ అధ్యక్ష ఎన్నికలపై వీడని అస్పష్టత

ఆంటోనీతో సోనియా భేటీ..

గహ్లోత్‌కు దక్కని అపాయింట్‌మెంట్‌

బెంగళూరు, ఈటీవీ భారత్‌-దిల్లీ: నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనున్నా ఇప్పటికీ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరెవరనేది తేలడం లేదు. రాజస్థాన్‌లో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ ఆయనకు లభించలేదని పార్టీ వర్గాలు ‘ఈటీవీ భారత్‌’కు తెలిపాయి. తన అభ్యర్థిత్వంపై స్పష్టత తీసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దిల్లీకి వచ్చేముందు రాజస్థాన్‌ గవర్నర్‌ కల్రాజ్‌ మిశ్రతోనూ ఆయన ఫోన్లో మాట్లాడడం విశేషం. ఇంతవరకు గహ్లోత్‌పై వేరే మచ్చ లేకపోయినా, ఎమ్మెల్యేల ధిక్కార స్వరం విషయం ఆయనకు తెలియకుండా జరిగిన పరిణామం కాదని అధిష్ఠానం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీతో, మరికొందరు సీనియర్‌ నేతలతో సోనియా మాట్లాడారు.

పార్టీ నిర్ణయం శిరోధార్యం: ఖర్గే
30న నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తానని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ఇదివరకే ప్రకటించారు. సోనియా అడిగినట్లయితే.. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఈ పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత నేతలు చెబుతున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆయన ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిసి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమని చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఆయన నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్ష పదవికి పోటీపై ఆసక్తి లేదని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ భోపాల్‌లో చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని