Telangana News: దసరాకే జాతీయ పార్టీ!

దసరా నాడు (వచ్చే నెల 5న) తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి

Updated : 29 Sep 2022 07:22 IST

విజయదశమి రోజున తెరాస కార్యవర్గ సమావేశం

అదేరోజు ఏకగ్రీవ తీర్మానం

సీఎం కేసీఆర్‌ యోచన

ఈనాడు, హైదరాబాద్‌: దసరా నాడు (వచ్చే నెల 5న) తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరై జాతీయ పార్టీ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న కేసీఆర్‌ ఇప్పటికే దీనికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. ఇక జాప్యం చేయరాదనే ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా విధివిధానాలపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస రాష్ట్ర నేతల ఏకాభిప్రాయంతో దసరా రోజు మధ్యాహ్నం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న తెరాసనే జాతీయ పార్టీగా మార్చనున్నారని సమాచారం. ఇప్పటికే దానికి భారత్‌ రాష్ట్ర సమితి తదితర పేర్లు పరిశీలనలో ఉండగా.. కొత్తగా ‘మేరా భారత్‌ మహాన్‌’, ఇతర పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా నాడు జాతీయ పార్టీపై తీర్మానం అనంతరం దాన్ని దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి, ఆమోదం కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ గుర్తు అయిన కారును కొనసాగించాలని విన్నవించనున్నారు. జాతీయ పార్టీ జెండా కూడా ప్రాథమికంగా ఖరారైనట్లు తెలుస్తోంది. భారతదేశ చిత్ర పటంతో పాటు గులాబీ రంగు సైతం ఆ జెండాలో మిళితమై ఉంటుందని సమాచారం.

బహిరంగ సభకు యోచన
జాతీయ పార్టీ ఆమోదం పొందిన తర్వాత భారీ బహిరంగ సభను రాష్ట్రంలో గానీ, దిల్లీలో గానీ నిర్వహించి, ఎజెండాను కేసీఆర్‌ వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీ సన్నాహాలపై ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని