రౌడీయిజం తరహాలో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం కావు

రాష్ట్రంలో ఉన్నట్లు రౌడీయిజం, సెటిల్‌మెంట్‌ తరహాలో వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పరిష్కారం కావని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు

Updated : 29 Sep 2022 05:19 IST

జీవీఎల్‌ నరసింహారావు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉన్నట్లు రౌడీయిజం, సెటిల్‌మెంట్‌ తరహాలో వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పరిష్కారం కావని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే కేసీఆర్‌, జగన్‌ కలుస్తారా? అని ప్రశ్నించారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుంటే జగన్‌కు చర్చించే తీరిక దొరకడం లేదా అని పేర్కొన్నారు. కేసీఆర్‌ నుంచి వ్యక్తిగతంగా ఏమీ ఆశిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో భాజపా తలపెట్టిన ప్రజాపోరు సభలు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. విశాఖ రైల్వేజోన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని, ఇందులో సందేహాలు లేవని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని