ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై ఎందుకీ కక్ష?

‘ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఎందుకు కలుగజేసుకుంటున్నారు? వారు ప్రజలతో ఎన్నికైనవారా? ప్రజల వల్లే ఈ స్థాయికి వచ్చారా? లేదు. భాజపా,

Published : 30 Sep 2022 06:31 IST

పాలనలో గవర్నర్ల జోక్యం అవసరమా?

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-ఆర్కేనగర్‌: ‘ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఎందుకు కలుగజేసుకుంటున్నారు? వారు ప్రజలతో ఎన్నికైనవారా? ప్రజల వల్లే ఈ స్థాయికి వచ్చారా? లేదు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఏం ఆధికారం ఉంది? ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఒకదాని తర్వాత మరొక ప్రభుత్వాన్ని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నారు...’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత, ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కేరళలో ముగించుకుని మళ్లీ  తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ప్రవేశించింది. శుక్రవారం కర్ణాటకలోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి గుడలూరులో ఆయన బస చేశారు. అంతముందు జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ఆయన విరుచుకుపడ్డారు. రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రజల సొమ్ము సమయానికి ఇవ్వాల్సి ఉండగా జీఎస్టీని రాష్ట్రాలకు చెల్లించడం లేదని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, భాషలను గౌరవించాల్సిందిపోయి.. ఒకే దేశం, ఒకే సంస్కృతిని రుద్దడానికి భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాము భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవిస్తామని, ఒకేలా ఉండమని బలవంతపెట్టబోమని చెప్పారు. దేశంలో భాషలు, సంస్కృతులు వాటి ఉనికి కోల్పోకుండా గౌరవిస్తామని తెలిపారు.

తారస్థాయికి నిరుద్యోగం: కేంద్ర ప్రభుత్వ విద్వేష రాజకీయాలతో ప్రస్తుతం నిరుద్యోగం తారస్థాయికి చేరుకుందని, అధిక ధరల్ని కూడా చూస్తున్నామని రాహుల్‌ పేర్కొన్నారు. రైతులు, కూలీలు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ‘యాత్రలో కొంతమంది ఉత్తమ వ్యాపారులను కలిశాను. ఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లు, ఫార్మా రంగాలకు చెందినవారు వాళ్లు. వీరే దేశానికి ఉద్యోగాలిచ్చేవారు. జీఎస్టీ తమ నాశనానికే వచ్చిందని అందరూ చెప్పారు. ఉప్పుతో ఉన్న జీడిపప్పునకు, తియ్యగా ఉన్న జీడపప్పునకు వేర్వేరు జీఎస్టీ ఉందని ఓ వ్యక్తి చెప్పారు...’ అని రాహుల్‌ వివరించారు. ప్రజల నుంచి డబ్బులు లాక్కోవడానికి ఈ విద్వేషపూరిత ప్రభుత్వం వచ్చిందని వ్యాఖ్యానించారు. రూ.400 ఉండే గ్యాస్‌ సిలిండరు ధర ఇప్పుడు రూ.1000 దాటిందని, పెట్రోలు, డీజిల్‌ పెరుగుతూనే ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రజల జేబుల నుంచి భాజపా డబ్బులు తీసుకుని వారు ఎంచుకున్న కొంతమందికి ఇస్తోందన్నారు. ఇలాంటి అన్యాయాన్ని దేశంలో కోరుకోవడం లేదని రాహుల్‌ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts