విశాఖకు రాజధాని రావద్దంటే చరిత్రహీనులవుతారు

విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా అడ్డుకునేవారు చరిత్రహీనులుగా మిగులుతారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం

Published : 30 Sep 2022 03:19 IST

మేం 175 సీట్లు గెలుస్తామంటే ఉలుకెందుకు?

తెదేపా నేతలపై మంత్రి బొత్స విసుర్లు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా అడ్డుకునేవారు చరిత్రహీనులుగా మిగులుతారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం విశాఖలోని గవర్నర్‌ బంగ్లాలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘రుషికొండలో మరో అతిథి గృహం కడుతున్నాం అక్కడ సీఎం అధికారిక నివాసం, కార్యాలయం నిర్మిస్తే తప్పేముంది? రుషికొండకు అవసరమైతే అఖిలపక్షాన్ని నేనే స్వయంగా తీసుకెళతా. ఎన్నికల్లో మేం 175 సీట్లు గెలుస్తామంటే తెదేపా నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? మా పార్టీ సమీక్ష సమావేశంపై ఏమిటా రాతలు? గంజాయిపై ఎక్కువగా దాడులు చేస్తున్నందునే కేసులు అధికంగా నమోదవుతున్నాయి’ అని అన్నారు. పాదయాత్రలో రైతుల తరఫున మాట్లాడుతున్న వ్యక్తి స్థిరాస్తి వ్యాపారి కాదా? అని మంత్రి ప్రశ్నించారు. తాము విశాఖను దోచుకోవాలంటే ఎప్పుడో సగం మా జేబులో ఉండేదని, తనకు దేవుని దయ వల్ల తాతతండ్రులు ఇచ్చిన ఆస్తి ఉందని, ఇంటర్‌ చదివేటప్పుడే అంబాసిడర్‌ కారులో తిరిగేవాణ్నని చెప్పారు. విశాఖను దోచుకోవడానికి ఇక్కడ ఉన్నవారంతా దోపిడీదారులా? అంటూ ఆయన మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts