సంజయ్‌ అయిదో విడత పాదయాత్ర ‘భైంసా-కరీంనగర్‌’!

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా అయిదో విడత పాదయాత్రను భైంసా నుంచి చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పాదయాత్రను భైంసాలో ప్రారంభించి

Published : 30 Sep 2022 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా అయిదో విడత పాదయాత్రను భైంసా నుంచి చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పాదయాత్రను భైంసాలో ప్రారంభించి తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ వరకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, చొప్పదండి, కరీంనగర్‌.. 11 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగేలా పాదయాత్ర ప్రముఖ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. ఆ వివరాలను ఆయన గురువారం కరీంనగర్‌లో బండి సంజయ్‌ని కలిసి వివరించారు. 20-25 రోజుల పాటు దాదాపు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగే అవకాశముంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని