రైల్వే జోన్‌పై భాజపా, వైకాపా డ్రామాలు

విశాఖ రైల్వే జోన్‌ విషయంలో భాజపా, వైకాపా కలిసే నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. విభజన చట్టంలోని ఆంశాలను అమలు

Published : 30 Sep 2022 04:37 IST

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శైలజానాథ్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: విశాఖ రైల్వే జోన్‌ విషయంలో భాజపా, వైకాపా కలిసే నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. విభజన చట్టంలోని ఆంశాలను అమలు చేయకుండా ఎనిమిదేళ్లుగా ప్రధాని మోదీ కాలయాపన చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ‘అధికారం ఇస్తే మోదీ మెడలు వంచుతానని చెప్పిన జగన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చాక మోదీ ముందు మోకరిల్లారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు రాకపోయినా, విశాఖ రైల్వే జోన్‌పై మాట మార్చినా... జగన్‌కు ఏమీ పట్టవు. జోన్‌ విషయంలో భాజపా, వైకాపా ప్రకటనలు చూస్తేనే వారి డ్రామాలు అర్థమైపోతున్నాయి. కేంద్ర మంత్రి ఒక మాట, రైల్వే బోర్డు మరో మాట, వైకాపా ఎంపీలు ఇంకో మాట... అంటే ప్రజలను గందరగోళంలోకి నెట్టేలా విధంగా ప్రణాళిక వేశారు. అమరావతిని జగన్‌ చంపి ఏపీకి రాజధాని లేకుండా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చలసాని శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా లేకున్నా నోటీసు ఇచ్చారు. వాటిని ఉపసంహరించుకోవాలి’ అని పోలీసులను శైలజానాథ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని