కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుతున్నారు

దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్‌ తెలిపారు. గురువారం తెరాస శాసనసభాపక్ష

Published : 30 Sep 2022 05:33 IST

ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ విఠల్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్‌ తెలిపారు. గురువారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ‘సింగరేణి లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు. సీఎం దూరదృష్టితోనే సింగరేణి రూ. 32 వేల కోట్లకు పైగా టర్నోవర్‌ సాధించి, ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. తొమ్మిది వేలమంది కార్మికులను క్రమబద్ధీకరించింది. కేంద్రం సింగరేణికి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ప్రైవేటీకరించాలని యోచిస్తోంది. భాజపా పాలనలో దేశానికి దశ దిశ లేకుండా పోతోంది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌ వేగుచుక్కగా మారారు’ అని సుమన్‌, సండ్ర, విఠల్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని