వైకాపావి విధ్వంసకర విధానాలు

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థకు, వైకాపాకు పెద్ద తేడా ఏమీ లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. ఆ రెండింటివి విధ్వంసకరమైన విధానాలేనని ధ్వజమెత్తారు.

Updated : 01 Oct 2022 07:10 IST

 భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ఈనాడు, అమరావతి: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థకు, వైకాపాకు పెద్ద తేడా ఏమీ లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. ఆ రెండింటివి విధ్వంసకరమైన విధానాలేనని ధ్వజమెత్తారు. వైకాపా విధ్వంసకర పార్టీ అని పేర్కొన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్చి ప్రభుత్వం వితండవాదం చేస్తోందన్నారు. నిజంగా పేరు మార్చాలనుకుంటే గుంటూరులో జిన్నాటవర్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పులివెందుల్లో పీకే టీం నిర్వహించిన సర్వేలో సీఎంకు 51 శాతం మద్దతు లభించింది. ఇటీవల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్షలో ప్రజల్లో బాగా తిరుగుతారని పేరున్న చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు చదివి మీ పనితీరు బాగోలేదని అంటున్నారు. తొలుత తన గ్రాఫ్‌ పడిపోతున్న విషయాన్ని మరిచి ఎమ్మెల్యేలపై నెపం వేస్తున్నారని’ ఆయన దుయ్యబట్టారు. ‘అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపాను గద్దె దించడానికి ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నామని, దీన్ని ఓర్చుకోలేక శుక్రవారం తెనాలిలో రథాన్ని తగులబెట్టారన్నారు.

 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts