ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు షెడ్యూలు ఖరారు

రాష్ట్రంలో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు 2023 మార్చి 29కి ఖాళీ అవుతాయని కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published : 01 Oct 2022 05:51 IST

దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 7 వరకూ గడువు

వచ్చే ఏడాది మార్చికి 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు 2023 మార్చి 29కి ఖాళీ అవుతాయని కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ మేరకు షెడ్యూలును శుక్రవారం ఖరారుచేసింది. డిసెంబరు 30వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశించింది.

షెడ్యూలు వివరాలివి..
ఓటర్ల నమోదుకు బహిరంగ ప్రకటన: అక్టోబరు 1
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: నవంబరు 7
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: నవంబరు 23
క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణకు గడువు: నవంబరు 23 నుంచి డిసెంబరు 9 వరకూ
తుది ఓటర్ల జాబితా ప్రచురణ: డిసెంబరు 30

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts