ఇక్కడివారిని పట్టించుకోని సీఎం దేశమంతా తిరుగుతారట: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో బాధితులను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశమంతా తిరగడానికి విమానం కొనుగోలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ విమానం కొనుగోలు చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన శుక్రవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Published : 01 Oct 2022 06:22 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బాధితులను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశమంతా తిరగడానికి విమానం కొనుగోలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ విమానం కొనుగోలు చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన శుక్రవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏనాడూ పరామర్శించిందీ లేదు. ప్రగతిభవన్‌లోని ఏసీ గదిని వీడింది లేదు.. వ్యవసాయ క్షేత్రాన్ని దాటింది లేదు. ఇప్పుడు దేశమంతా తిరగడానికి విమానం కొంటున్నాడట!. ఎవని పాలయ్యిందో తెలంగాణ..!!’’ అని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం చేపట్టిన సాగరహారం కార్యక్రమం పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రేవంత్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘‘చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయి. తెలంగాణ ఉద్యమం సకల జనులది. సాగరహారం ఆ జనుల తరఫున ప్రాతినిధ్యం వహించిన ఐకాస ఆధ్వర్యంలో జరిగింది. నాడు ఉద్యమంపై.. నేడు రాష్ట్రంపై పడి బతకడం మీకు అలవాటైపోయింది’’ అంటూ కేసీఆర్‌ కుటుంబాన్ని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని