అశోక్‌ గహ్లోత్‌ కొనసాగేనా?

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పీఠానికి ఎసరు పెట్టొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి! ఆ రాష్ట్ర సీఎం పదవిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తాజాగా తెలపడం వాటికి బలం చేకూరుస్తోంది.

Published : 01 Oct 2022 06:22 IST

రాజస్థాన్‌ సీఎం పీఠంపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న సోనియా

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పీఠానికి ఎసరు పెట్టొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి! ఆ రాష్ట్ర సీఎం పదవిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తాజాగా తెలపడం వాటికి బలం చేకూరుస్తోంది. మరోవైపు- తాను పదవిలో కొనసాగడం గురించి విలేకర్లు దిల్లీలో శుక్రవారం అడిగిన ప్రశ్నకు గహ్లోత్‌ నేరుగా సమాధానమివ్వలేదు. ‘‘రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని సోనియా ఎదుట మీరు ప్రతిపాదించారా?’’ అని విలేకర్లు ఆయన్ను ప్రశ్నించారు. దీంతో గహ్లోత్‌ స్పందిస్తూ.. ‘‘గత 50 ఏళ్లలో గాంధీ కుటుంబం దీవెనలతో నేను అనేక పదవులు చేపట్టాను. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు నాకు పదవులు ముఖ్యం కాదు. దేశంలో కాంగ్రెస్‌ బలపడాలి. ఆ దిశగా కృషి చేస్తాను’’ అని బదులిచ్చారు. ‘‘ప్రస్తుతం నా అంతట నేనుగా సీఎం పదవిని వీడితే.. కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు నేను పారిపోతున్నానని అంతా అనుకుంటారు. కాబట్టి అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటా’’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts