డిసెంబరు కల్లా అన్ని గ్రామాలకు భాజపా

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర, ముఖ్యనేతల బైక్‌ ర్యాలీ కార్యక్రమాలతో తమ పార్టీ బలోపేతం అవుతోందని, ఈ ఏడాది డిసెంబరు కల్లా తెలంగాణలోని అన్ని గ్రామాలకు విస్తరిస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

Published : 01 Oct 2022 06:56 IST

శాసనసభ రద్దు వరకే కేసీఆర్‌ చేతుల్లో.. లోక్‌సభతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు
భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర, ముఖ్యనేతల బైక్‌ ర్యాలీ కార్యక్రమాలతో తమ పార్టీ బలోపేతం అవుతోందని, ఈ ఏడాది డిసెంబరు కల్లా తెలంగాణలోని అన్ని గ్రామాలకు విస్తరిస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణలో తెరాస గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతోందని, రాష్ట్రంలో విజయావకాశాలు ఉండటంతోనే అగ్రనేత అమిత్‌షా ఇక్కడికి తరచూ వస్తున్నారని అన్నారు. ‘‘శాసనసభను గడువు పూర్తయ్యేంతవరకు కొనసాగించాలా.. లేదా.. అన్న విషయమే కేసీఆర్‌ చేతుల్లో ఉంటుంది. రద్దు చేస్తే ఎన్నికలను నిర్వహించాల్సిన తేదీని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది.  చేతుల్లో ఉంటుంది. లోక్‌సభతో పాటు కలిపి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం ఒక ఆప్షన్‌గా ఉండొచ్చు. త్వరలో నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ భాజపాలో చేరబోతున్నారు’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. ఏపీలో తెదేపాతో పొత్తు ప్రచారం మాత్రమేనని, ఆ ఆలోచనే తమ పార్టీకి లేదు అని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని