రఘురామ కేసులో తదుపరి చర్యలొద్దు

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇంద్‌ భారత్‌ బ్యాంకు రుణాల కేసులో తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం సెక్షన్‌ 35ఏ కింద రిజర్వు బ్యాంకు 2016 జులై 1న జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఇంద్‌ భారత్‌ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటిస్తూ గతేడాది డిసెంబరు 6న తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది.

Published : 02 Oct 2022 04:15 IST

సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

బ్యాంకు ఖాతాల దర్యాప్తుపై ఆర్‌బీఐకి నోటీసులు

ఈనాడు, దిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇంద్‌ భారత్‌ బ్యాంకు రుణాల కేసులో తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం సెక్షన్‌ 35ఏ కింద రిజర్వు బ్యాంకు 2016 జులై 1న జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఇంద్‌ భారత్‌ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటిస్తూ గతేడాది డిసెంబరు 6న తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. కంపెనీ ఖాతా లావాదేవీలపై బ్యాంకులతో పాటు సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయొచ్చంటూ కోర్టు అనుమతించింది. రిజర్వు బ్యాంకు సర్క్యులర్‌ను సవాల్‌ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను  విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ... రిజర్వ్‌ బ్యాంకు సర్క్యులర్‌లోని లోపాలను ఎత్తిచూపారు. మోసపూరిత ఖాతాలుగా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ అంశంలో తాము చెప్పే వరకు తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సీబీఐని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని