మహిళల కన్నీళ్లతో పన్నీరు చల్లుకుంటున్న సీఎం జగన్‌: ఐద్వా

మడమ తిప్పను.. మాట తప్పను అన్న సీఎం జగన్‌ మాట తప్పి మహిళల కన్నీళ్లతో పన్నీరు చల్లుకుంటున్నారని ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి విమర్శించారు. రాష్ట్రంలో 2,934 మద్యం దుకాణాలను కొనసాగించడంతో పాటు అదనంగా పర్యాటక ప్రదేశాల్లో దుకాణాలకు అనుమతించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు-662ను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

Published : 02 Oct 2022 04:15 IST

ఈనాడు, అమరావతి: మడమ తిప్పను.. మాట తప్పను అన్న సీఎం జగన్‌ మాట తప్పి మహిళల కన్నీళ్లతో పన్నీరు చల్లుకుంటున్నారని ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి విమర్శించారు. రాష్ట్రంలో 2,934 మద్యం దుకాణాలను కొనసాగించడంతో పాటు అదనంగా పర్యాటక ప్రదేశాల్లో దుకాణాలకు అనుమతించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు-662ను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ‘‘పాదయాత్ర సమయంలో ఆడబిడ్డల కన్నీరు తుడుస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. మద్య నిషేధం విధిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశలవారీగా అమలు చేస్తామన్నారు. ఏడాదికి 20% చొప్పున  తగ్గిస్తూ వస్తే.. ఇప్పటికే 80% మద్యం దుకాణాలు తగ్గాలి.  అయితే అందుకు విరుద్ధంగా మూడు వేల దుకాణాలను కొనసాగిస్తూ ఇచ్చిన హామీని అటకెక్కించారు.  దేవాలయాల వద్ద దుకాణాలు పెట్టారు. అత్యాచారాలు, వేధింపులు, హత్యలు పెరగడానికి మద్యం ఒక ప్రధాన కారణం కాదా? మద్యాన్ని నిషేధించకుండా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా పేదల జీవితాలు మెరుగుపడవు...’’ అని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని