కేసీఆర్‌ జాతీయ పార్టీ పెడితే స్వాగతిస్తాం: సీపీఐ నారాయణ

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ పెడితే స్వాగతిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 02 Oct 2022 05:33 IST

ఈనాడు-హైదరాబాద్‌, అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ పెడితే స్వాగతిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘గతంలో కేసీఆర్‌.. భాజపాకు అనుకూలంగా ఉన్నా ఇప్పుడు బహిరంగంగానే దానిపై ఆందోళన చేస్తున్నారు. భాజపా వ్యతిరేక కూటమిని బలపరిచేందుకు కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టడం మంచిదే. కేంద్రం అంబానీ, అదానీలకు మేలు చేకూర్చేలా 5జీ సాంకేతికతను అంకితం చేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం పూర్తిస్థాయి 4జీకే వెళ్లలేకపోయింది..’ అని విమర్శించారు.

హరీశ్‌ వ్యాఖ్యలపై ఉలికిపాటేందుకు?
ఈనాడు, అమరావతి: ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కడగండ్లపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వాస్తవాలు చెబితే వైకాపా నేతలకు ఉలికిపాటేందుకు అని ఆరాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ‘‘జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల నిరంకుశంగా ప్రవర్తించడం నిజం కాదా? పీఆర్సీ అమలులో ముప్పుతిప్పలు పెట్టలేదా?’’ అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని