కొవిడ్‌ బాధితుల మాటేంటి?

కర్ణాటకలో ప్రవేశించిన రాహుల్‌గాంధీ ‘భారత్‌ ఐక్యతా యాత్ర’ శనివారం రెండోరోజు విజయవంతమైంది. రాష్ట్రంలోని గుండ్లుపేటె తొండవాడి నుంచి ఉదయం 7:30 గంటలకు మొదలైన యాత్ర... 23 కిలోమీటర్లు కొనసాగింది.

Updated : 02 Oct 2022 06:24 IST

ప్రధానికి రాహుల్‌ ప్రశ్న

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో ప్రవేశించిన రాహుల్‌గాంధీ ‘భారత్‌ ఐక్యతా యాత్ర’ శనివారం రెండోరోజు విజయవంతమైంది. రాష్ట్రంలోని గుండ్లుపేటె తొండవాడి నుంచి ఉదయం 7:30 గంటలకు మొదలైన యాత్ర... 23 కిలోమీటర్లు కొనసాగింది. ఈ సందర్భంగా గత ఏడాది కొవిడ్‌కు చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ లేక చామరాజనగర ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఏడాది గడచినా ఈ బాధిత కుటుంబాలకు భాజపా సర్కారు పరిహారం చెల్లించలేదని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. వారిని ఆదుకోవాలని ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts