కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో ఇద్దరే

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ మాత్రమే మిగిలారు. శనివారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కె.ఎన్‌.త్రిపాఠి నామినేషన్‌ను తిరస్కరించినట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంస్థ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ విలేకరులకు తెలిపారు.

Updated : 02 Oct 2022 06:20 IST

త్రిపాఠి నామినేషన్‌ తిరస్కరణ

ఖర్గే, థరూర్‌ మధ్యే పోటీ

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ మాత్రమే మిగిలారు. శనివారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కె.ఎన్‌.త్రిపాఠి నామినేషన్‌ను తిరస్కరించినట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంస్థ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ విలేకరులకు తెలిపారు. ‘మొత్తం 20 దరఖాస్తులు అందాయి. సంతకాలు సరిపోలకపోవడం, లేదా పునరావృతం కావడం వల్ల వీటిలో నాలుగింటిని తిరస్కరించాం. ఖర్గే 14 దరఖాస్తులు, థరూర్‌ ఐదు, త్రిపాఠి ఒకటి సమర్పించారు. ఖర్గే, థరూర్‌ మధ్యే పోటీ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8 వరకు గడువు ఉంది. అప్పటిలోగా ఉపసంహరణలేమీ లేకపోతే 17న పోలింగ్‌ నిర్వహిస్తాం’ అని చెప్పారు. పరిశీలన తర్వాత తాను, ఖర్గే మాత్రం బరిలో మిగిలిన విషయాన్ని థరూర్‌ ట్వీట్‌ చేస్తూ- ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పార్టీ ప్రయోజనం పొందుతుందని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో దీక్షాభూమి వద్ద డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌కు నివాళులర్పించి ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఎన్నికల బరిలో అధికారిక అభ్యర్థి ఎవరూ ఉండరని గాంధీ కుటుంబం తనకు చెప్పినట్లు వెల్లడించారు. అందువల్ల దానిపై తనకు ఎలాంటి సందేహాలూ లేవన్నారు.

విపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా
రాజ్యసభ విపక్ష నేత పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే తీర్మానంలో భాగంగా ఈ మేరకు లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. ఈ పదవిని సీనియర్‌ నేతలు పి.చిదంబరం, లేదా దిగ్విజయ్‌సింగ్‌కు పార్టీ అప్పగిస్తుందని సమాచారం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts