వీఆర్‌ఏలకు సీఎం క్షమాపణ చెప్పాలి: డీకే అరుణ

వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన వీఆర్‌ఏల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరించిన తీరు సరిగా లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

Updated : 02 Oct 2022 06:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన వీఆర్‌ఏల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరించిన తీరు సరిగా లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. వినతిపత్రాన్ని విసిరేయడం సీఎం అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజాసమస్యలు వినే ఓపిక లేని కేసీఆర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, వీఆర్‌ఏలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని