రాజస్థాన్‌ ప్రజలతోనే ఉంటా: గహ్లోత్‌

తుదిశ్వాస వరకు రాజస్థాన్‌ ప్రజలతోనే ఉంటానని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ చెప్పారు. రాష్ట్ర తదుపరి బడ్జెట్‌ కోసం ప్రజలు నేరుగా తనకు సలహాలు పంపాలని కోరడం ద్వారా తాను సీఎం పదవిలో కొనసాగబోతున్నట్లు సంకేతాలిచ్చారు.

Published : 02 Oct 2022 04:55 IST

జైపుర్‌: తుదిశ్వాస వరకు రాజస్థాన్‌ ప్రజలతోనే ఉంటానని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ చెప్పారు. రాష్ట్ర తదుపరి బడ్జెట్‌ కోసం ప్రజలు నేరుగా తనకు సలహాలు పంపాలని కోరడం ద్వారా తాను సీఎం పదవిలో కొనసాగబోతున్నట్లు సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌ సర్కారు ఐదేళ్లూ పూర్తి చేసుకుంటుందని చెప్పారు. శుక్రవారం రాత్రి సిరోహీ జిల్లాలోని అబూరోడ్‌ వద్ద బహిరంగ సభాస్థలికి ఆలస్యంగా వచ్చిన ప్రధాని.. మోకాలిపై మూడుసార్లు వంగి అక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పడాన్ని గహ్లోత్‌ ప్రస్తావిస్తూ తనకంటే వినయం ఉన్న వ్యక్తిగా కనిపించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. చిన్నతనం నుంచి తాను అత్యంత వినయశీలిననీ, ఈ విషయంలో మోదీ పోటీ పడలేరని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు