బహుజనుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్న అధికారులు

బీపీ మండల్‌ విగ్రహ పైలాన్‌ను ధ్వంసం చేయడం ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు.. బహుజనుల ఆత్మభిమానాన్ని దెబ్బ తీశారని జై భీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌, అధికార ప్రతినిధి వై.కొండలరావు అన్నారు.

Published : 02 Oct 2022 05:18 IST

ప్రభుత్వమే బీపీ మండల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

జై భీమ్‌ భారత్‌ పార్టీ డిమాండ్‌

ఈనాడు, అమరావతి: బీపీ మండల్‌ విగ్రహ పైలాన్‌ను ధ్వంసం చేయడం ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు.. బహుజనుల ఆత్మభిమానాన్ని దెబ్బ తీశారని జై భీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌, అధికార ప్రతినిధి వై.కొండలరావు అన్నారు. అధికారుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో వారు పేర్కొన్నారు. ‘విగ్రహ స్థాపన అనుమతుల కోసం రాష్ట్ర బీసీ సంఘం గత ఆరు నెలలుగా నిరీక్షిస్తూ...చివరకు అధికార పార్టీలోని బలహీనవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ చేసి పైలాన్‌ నిర్మించడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా...ఏకపక్షంగా గత నెల 28న పైలాన్‌ను ధ్వంసం చేయడం అన్యాయం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి అదే ప్రాంతంలో బీపీ మండల్‌ విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసి మూడు నెలల్లో ఆవిష్కరించాలి’ అని డిమాండ్‌చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని