ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ నియంత పాలన

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చింతకాయల విజయ్‌ హైదరాబాద్‌లో ఉంటున్న నివాసంపై ఏపీ సీఐడీ పోలీసులు దాడి చేయడాన్ని తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని

Updated : 02 Oct 2022 06:11 IST

తెదేపా తెలంగాణ నేతలు బక్కని, రావుల

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చింతకాయల విజయ్‌ హైదరాబాద్‌లో ఉంటున్న నివాసంపై ఏపీ సీఐడీ పోలీసులు దాడి చేయడాన్ని తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ నిర్బంధకాండకు ఇది ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. విజయ్‌ నివాసంలో చివరికి పసిపిల్లలను కూడా భయభ్రాంతులకు గురిచేయడం హేయమని అన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ నియంత పాలన సాగిస్తూ హిట్లర్‌ను మించిపోయారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని