బతుకమ్మ పండగ రోజు సెలవు ఇవ్వకపోవడం దారుణం: బండి సంజయ్‌

తెలంగాణ అంటేనే బతుకమ్మ అని.. అంతటి విశిష్టమైన పండగ నాడు ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 03 Oct 2022 05:56 IST

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: తెలంగాణ అంటేనే బతుకమ్మ అని.. అంతటి విశిష్టమైన పండగ నాడు ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ పండగ నాడు సెలవు ఇవ్వని కేసీఆర్‌ తెలంగాణకు ముఖ్యమంత్రా లేక వేరే రాష్ట్రానికా అని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే ఉద్యోగులంతా విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకు సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని