గుజరాత్‌లో ఒక్కో గోవుకు రోజుకు రూ.40

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం.. రాజ్‌కోట్‌లో హిందూ ఓటర్లే లక్ష్యంగా కొత్త హామీ గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే.. ఒక్కో గోవు పోషణకు రోజుకు రూ.40 ఇస్తామని ప్రకటించారు.

Updated : 03 Oct 2022 05:55 IST

 హిందూ ఓటర్లే లక్ష్యంగా కేజ్రీవాల్‌ హామీ

రాజ్‌కోట్‌: గుజరాత్‌ పర్యటనలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం.. రాజ్‌కోట్‌లో హిందూ ఓటర్లే లక్ష్యంగా కొత్త హామీ గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే.. ఒక్కో గోవు పోషణకు రోజుకు రూ.40 ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు.. పాలు ఇవ్వని ఆవులకూ ప్రత్యేక సంరక్షణశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కేజ్రీవాల్‌పై ప్లాస్టిక్‌ నీళ్ల బాటిల్‌!

రాజ్‌కోట్‌లో ఓ గర్బా కార్యక్రమంలో కేజ్రీవాల్‌పై ఓ ప్లాస్టిక్‌ నీళ్ల బాటిల్‌ను ఎవరో విసిరారని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఆదివారం తెలిపారు. అయితే అది ఆయనకు తగలలేదని, తలపై నుంచి వెళ్లి పక్కకు పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts