దేశ గతి మార్చనున్న కేసీఆర్‌: మంత్రి సత్యవతి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశం గతిని మార్చబోతున్నారని, జాతీయ పార్టీ ఏర్పాటు చారిత్రక నిర్ణయమని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎంతో సమావేశం అనంతరం సత్యవతి మాట్లాడుతూ దేశప్రజల తలరాతను మార్చే జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు సీఎం చెప్పటంపై అంతటా ఆనందం వ్యక్తమవుతోందన్నారు.

Published : 03 Oct 2022 02:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశం గతిని మార్చబోతున్నారని, జాతీయ పార్టీ ఏర్పాటు చారిత్రక నిర్ణయమని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎంతో సమావేశం అనంతరం సత్యవతి మాట్లాడుతూ దేశప్రజల తలరాతను మార్చే జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు సీఎం చెప్పటంపై అంతటా ఆనందం వ్యక్తమవుతోందన్నారు. ఎన్నెన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. తెలంగాణను అయన దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న భాజపా నుంచి దేశానికి త్వరలోనే విముక్తి లభిస్తుందన్నారు. ప్రభుత్వ విప్‌ రేగ కాంతారావు మాట్లాడుతూ 5న సీఎం కేసీఆర్‌ సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మేధస్సును భారత ప్రజలంతా కోరుకుంటున్నారని, కనకదుర్గమ్మ దీవెనలతో ఈ నెల 5న గొప్ప నిర్ణయాన్ని ప్రకటించనున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని