‘భారతి పే’ పోస్టర్‌ వ్యవహారంలో.. ఎవరి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు?

భారతి పే పోస్టర్‌ వ్యవహారంపై ఎవరు ఫిర్యాదుచేస్తే ఏపీ సీఐడీ కేసు నమోదుచేసి చింతకాయల విజయ్‌కు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించిందో చెప్పాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.

Published : 03 Oct 2022 06:49 IST

ఎంపీ రఘురామ మండిపాటు

ఈనాడు, దిల్లీ: భారతి పే పోస్టర్‌ వ్యవహారంపై ఎవరు ఫిర్యాదుచేస్తే ఏపీ సీఐడీ కేసు నమోదుచేసి చింతకాయల విజయ్‌కు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించిందో చెప్పాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం దిల్లీలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ‘సీఐడీ పోలీసులు కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేయాలి. నేరుగా ఫిర్యాదులను స్వీకరించే అధికారం సీఐడీకి లేదు. భారతి పే పోస్టర్‌ వ్యవహారంలో కోర్టులు ఆదేశించాయని కేసు నమోదుచేశారా? లేదంటే భారతి ఫిర్యాదు చేశారా.. చెప్పాలి’ అని రఘురామ డిమాండ్‌ చేశారు. విజయ్‌కు ఇచ్చిన నోటీసులో 153ఎ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారని, ఇందులో ప్రజల మధ్య చిచ్చుపెట్టే అంశం ఎక్కడుందో చెప్పాలన్నారు. ‘మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్‌ ఎందులోనూ దొరకడంలేదని, ఏదోరకంగా కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ భారతిపై మా పార్టీ వారే వేశారని చెబుతున్న భారతి పే పోస్టర్‌ వ్యవహారంలో విజయ్‌ ప్రమేయం ఉందంటూ ఆయన ఇంట్లో సీఐడీ సోదాలకు దిగడం దారుణం. కోర్టు వారెంట్‌ లేకుండానే ఇంట్లోకి దూరి పనిమనిషిపై చేయిచేసుకోవడం, చిన్నారులను వేధించడం ఏమిటి’ అని నిలదీశారు. విజయ్‌ ఇంట్లో లేనందున అరెస్ట్‌ చేయలేకపోయారని, ఒకవేళ ఉంటే ఎత్తుకెళ్లి ఏం చేసేవారో? అని పేర్కొన్నారు. ‘41ఏ నోటీసులు ఇచ్చేందుకే అయితే, పోలీసులు మూడు వాహనాల్లో వెళ్లాల్సిన అవసరం ఏముంది? అందులోనూ ఒక వాహనం దొంగ నంబర్‌తో ఉంది. ద్విచక్రవాహన నంబర్‌ను పోలీసులు ఈ వాహనానికి తగిలించుకొన్నారు. పైగా తొలుత తాము బ్యాంకు అధికారులమని బుకాయించార’ని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని