విభజించి పాలిస్తున్న మోదీ, కేసీఆర్‌

విభజించు పాలించు అన్న బ్రిటిషర్ల సిద్ధాంతాలను దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెడుతూ విషబీజాలు నాటుతున్నారని వ్యాఖ్యానించారు.

Published : 03 Oct 2022 04:45 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

కార్ఖానా, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: విభజించు పాలించు అన్న బ్రిటిషర్ల సిద్ధాంతాలను దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెడుతూ విషబీజాలు నాటుతున్నారని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్‌లోని బోయినపల్లిలో మహాత్మాగాంధీ ఐడియాలజి సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన గాంధీజీ జయంతి వేడుకల్లో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ హనుమంతరావుతో కలసి ఆయన పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. గాంధీజీ విదేశీ వస్తువుల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం లాంటి పోరాటాలు చేసి బ్రిటిష్‌ వాళ్ల మెడలు వంచి స్వాతంత్య్రం తీసుకొచ్చారన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో నేడు రాహుల్‌గాంధీ సైతం దేశంలో వైషమ్యాలను తగ్గించేందుకు భారత్‌ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. 

* మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు వారికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి రోహిత్‌ చౌదరి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

* రాజీవ్‌గాంధీ సద్భావన పురస్కారానికి ఈ ఏడాది మాజీ పార్లమెంటు సభ్యులు ఆర్‌.సురేందర్‌రెడ్డి(91)ని ఎంపిక చేసినట్లు రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక సమితి ఛైర్మన్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ గాంధీభవన్‌లో ఆదివారం వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని