రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రచారం షురూ

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందడి రాష్ట్రంలో ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి శశిథ]రూర్‌ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం హైదరాబాద్‌ వచ్చారు.

Published : 03 Oct 2022 04:45 IST

హైదరాబాద్‌లో శశిథరూర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందడి రాష్ట్రంలో ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి శశిథ]రూర్‌ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో శశిథరూర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తాను నాగ్‌పుర్‌ వెళ్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దీక్ష భూమిని సందర్శించినట్లు తెలిపారు. అనంతరం వార్దా, సేవాగ్రాం ఆచార్య వినోబాబావే ఆశ్రమం సందర్శించి కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశమైనట్లు చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలు, ఏఐసీసీ ప్రతినిధులను కలిసి తనకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు వివరించారు.

రెండోవారంలో ఖర్గే ప్రచారం

ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిమిత్తం అక్టోబరు రెండో వారంలో హైదరాబాద్‌కు వస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరు చొప్పున 238 మంది ప్రతినిధులు ఏఐసీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని