దేశాన్ని దోచుకునేందుకు వెళుతున్నారు: షర్మిల

ఎనిమిదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోదని సీఎం కేసీఆర్‌ దేశాన్ని ఏలేందుకు వెళుతున్నారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఆదివారం జిల్లా కేంద్రం మెదక్‌కు చేరుకుంది.

Published : 03 Oct 2022 04:45 IST

మెదక్‌, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోదని సీఎం కేసీఆర్‌ దేశాన్ని ఏలేందుకు వెళుతున్నారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఆదివారం జిల్లా కేంద్రం మెదక్‌కు చేరుకుంది. స్థానిక రాందాస్‌ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వందల మంది రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకులైన కేసీఆర్‌ దేశాన్ని చుట్టేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టి విమానం కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ అవినీతి ఒక కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే చాలని, రూ.వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ఆర్టీసీలో సంఘాలు లేకుండా చేశారని, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. మంబోజిపల్లి గ్రామంలో ఎన్డీఎస్‌ఎల్‌ పరిశ్రమలకు చెందిన కార్మికులు షర్మిలను కలిసి సమస్యలను ఏకరువు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని