స్వీయ సర్కార్‌పై విమర్శలతో.. బిహార్‌ మంత్రి రాజీనామా

రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేస్తూ వచ్చిన బిహార్‌ వ్యవసాయశాఖ మంత్రి సుధాకర్‌ సింగ్‌ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.

Published : 03 Oct 2022 04:45 IST

పట్నా: రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేస్తూ వచ్చిన బిహార్‌ వ్యవసాయశాఖ మంత్రి సుధాకర్‌ సింగ్‌ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కైముర్‌ జిల్లాలోని రామ్‌గఢ్‌ నుంచి ఆర్జేడీ టికెటుతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుధాకర్‌ సింగ్‌ ఇటీవల మంత్రి అయ్యారు. ‘నా శాఖలో దొంగలున్నారు. నేను దొంగల నాయకుడిగా పనిచేస్తున్నా’ అంటూ మీడియా ఎదుట ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. ‘అవినీతి అధికారులను చెప్పులతో కొట్టండి’ అంటూ సభలో మరో ప్రకటన కూడా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని