తెరాస అభ్యర్థి కూసుకుంట్ల..!

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడడంతో తెరాస అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల అయిదో తేదీ దసరా రోజు మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో జాతీయ పార్టీపై ప్రకటన అనంతరం.. ఆయన మునుగోడు ఎన్నికపై నేతలతో సమావేశమవుతారు.

Published : 04 Oct 2022 03:38 IST

అధికారికంగా రేపు ప్రకటించనున్న సీఎం 

ఈనాడు హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడడంతో తెరాస అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల అయిదో తేదీ దసరా రోజు మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో జాతీయ పార్టీపై ప్రకటన అనంతరం.. ఆయన మునుగోడు ఎన్నికపై నేతలతో సమావేశమవుతారు. అనంతరం పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. జాతీయ పార్టీగా మార్పు కోరుతూ పార్టీ నేతలు ఈ నెల ఆరో తేదీన భారత ఎన్నికల సంఘానికి అఫిడవిట్‌ సమర్పించనున్నారు. ఆమోదం పొందిన తర్వాత ప్రభాకర్‌రెడ్డికి జాతీయ పార్టీ పేరిట బీఫారం అందజేయాలని భావిస్తున్నారు.మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. అక్కడ గెలిచి.. జాతీయ పార్టీగా బోణీ చేయాలని, భాజపాను ఓడించి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఆదివారం జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశంలో ఆయన మునుగోడు ఉప ఎన్నిక ప్రాధాన్యాన్ని వివరించి, అక్కడ జాతీయ పార్టీగా బరిలోకి దిగుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా రోజున తెలంగాణభవన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశమవుతారు. గతంలో నిర్దేశించిన పార్టీ వ్యూహం అమలును సమీక్షించి కార్యాచరణ కొనసాగింపుపై చర్చిస్తారు. ఇప్పటికే రెండు గ్రామాలకో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. గ్రామాలవారీగా, పురపాలక వార్డుల వారీగా కూడా బాధ్యుల పేర్లను ప్రకటిస్తారు. చండూరులో సీఎం పర్యటన తేదీతో పాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుల ప్రచార పర్యటనల తేదీలను ఖరారు చేస్తారు. స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేస్తారు. సీపీఐ, సీపీఎంలు తెరాసకు మద్దతు ప్రకటించినందున ఆ పార్టీలతో ప్రచార సమన్వయ కార్యక్రమాలను సీఎం వెల్లడిస్తారని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts