KTR: మునుగోడు ప్రజలు ఎవరి వైపు?.. కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

మునుగోడు ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ, ప్రజలు ఎవరివైపు అంటూ మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌లో ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

Updated : 04 Oct 2022 09:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ, ప్రజలు ఎవరివైపు అంటూ మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌లో ప్రశ్నించారు. ఫ్లోరోసిస్‌ భూతాన్ని నల్గొండ బిడ్డలకు శాపంగా ఇచ్చిన కాంగ్రెస్‌ పక్షానా? ఈ వ్యాధి నిర్మూలనకు నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా మిషన్‌ భగీరథకు పైసా ఇవ్వని భాజపా వైపా? ఫ్లోరోసిస్‌ నుంచి మిషన్‌ భగీరథ ద్వారా శాశ్వత విముక్తి కల్పించిన తెరాస వైపు ఉంటారా? అని అడిగారు. ఈ మూడు పార్టీల్లో వేటికి పోటీ చేసే అర్హత ఉందో గుర్తించాలన్నారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు దిల్లీలోని ఆయన కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఫ్లోరైడ్‌ బాధిత చిన్నారులను పరిశీలిస్తున్న ఫొటోను ఆయన ట్విటర్‌కు జత చేశారు. ‘‘నాడు స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు. సమస్య పరిష్కారం కాలేదు. నేడు కేసీఆర్‌ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కేంద్రం సైతం పార్లమెంటులో చెప్పింది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని