మహాత్ముడిని మహిషాసురుడితో పోలుస్తారా?

కోల్‌కతాలో హిందూమహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహాత్మాగాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించడంపై మంత్రి కేటీరామారావు సోమవారం ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Updated : 04 Oct 2022 06:36 IST

ట్విటర్‌లో కేటీఆర్‌ ఆగ్రహం

కోల్‌కతాలో హిందూమహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహాత్మాగాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించడంపై మంత్రి కేటీరామారావు సోమవారం ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విశ్వగురువుగా ఈ ప్రపంచం గుర్తించిన ఏకైక భారతీయుడు గాంధీజీ అని.. తమకు తాము విశ్వగురువులమని అనుకునే వారు, గాడ్సేను ప్రేమించేవారు..మహాత్ముడిని, ఆయన భావజాలాన్ని కించపరిచేవారు లక్షల సంవత్సరాలైనా విజయం సాధించలేరని కేటీఆర్‌ పేర్కొన్నారు. కోల్‌కతాలో హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహిషాసురుడిని మహాత్మా గాంధీ మాదిరిగా చిత్రీకరించడాన్ని తప్పుపడుతూ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. గాంధీ మాదిరి ఏర్పాటుచేసిన మహిషాసురుడిని దుర్గాదేవి చంపినట్లుగా చిత్రీకరించారని, గాడ్సేను జాతిపితగా ప్రకటించే రోజు ఎంతో దూరంలో లేదని నాగేశ్వర్‌ పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు