సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చారు

కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తూ జగన్‌ సర్కార్‌ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ధ్వజమెత్తారు. పల్లెల అభివృద్ధిని నాశనం చేయడమేనా వికేంద్రీకరణ అంటే? అని ప్రశ్నించారు.

Published : 04 Oct 2022 05:26 IST

తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తూ జగన్‌ సర్కార్‌ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ధ్వజమెత్తారు. పల్లెల అభివృద్ధిని నాశనం చేయడమేనా వికేంద్రీకరణ అంటే? అని ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. 14, 15వ ఆర్థిక సంఘం గ్రామాల అభివృద్ధికి విడుదల చేసిన రూ.8548.29 కోట్ల నిధులను దిగమింగారు. క్షేత్ర స్థాయిలో కనీసం బ్లీచింగ్‌ కొనలేని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. జగన్‌ దోపిడీ విధానంతో మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యానికి తూట్లుపొడుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందించడం, నిరసన వ్యక్తం చేయాల్సి రావడం దురదృష్టకరం...’ అని పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధికి తన వాటా నిధులు విడుదల చేయకపోగా.. కేంద్రం ఇస్తున్న నిధులనూ దోచేస్తున్నారని చెంగల్రాయుడు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని