ఉత్త రేషన్‌ బియ్యంతో పండగెలా చేసుకుంటారు?

చౌకధరల దుకాణాల ద్వారా కేవలం రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తే.. ప్రజలు పండగెలా చేసుకుంటారని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ప్రశ్నించారు. పండగ నాడు పేదలను పస్తుల్లో ఉంచి, వారి జీవితాల్లో జగన్‌ చీకట్లు నింపారని మండిపడ్డారు. తెదేపా హయాంలో పండగ వేళ పది రకాల సరకులు ప్రజలకు ఉచితంగా అందేవని చెప్పారు.

Published : 04 Oct 2022 05:26 IST

మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చౌకధరల దుకాణాల ద్వారా కేవలం రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తే.. ప్రజలు పండగెలా చేసుకుంటారని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ప్రశ్నించారు. పండగ నాడు పేదలను పస్తుల్లో ఉంచి, వారి జీవితాల్లో జగన్‌ చీకట్లు నింపారని మండిపడ్డారు. తెదేపా హయాంలో పండగ వేళ పది రకాల సరకులు ప్రజలకు ఉచితంగా అందేవని చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘ విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు సీఎం డౌన్‌డౌన్‌ అని నినాదాలు చేశారంటే..ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ఎంత బాగా చేశారో అర్థమవుతోంది. అమరావతి రైతులను అవహేళన చేస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు ఏం మేలు చేశారో చెప్పాలి. మూడు పంటలు పండే భూముల్ని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల్ని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించడం సిగ్గుచేటు...’ అని పేర్కొన్నారు. వైకాపా మేనిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చామంటూ జగన్‌ గొప్పలు చెబుతున్నారని, వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని