సర్పంచులను బిచ్చగాళ్లను చేసిన ప్రభుత్వం: తులసిరెడ్డి

జగన్‌ ప్రభుత్వం సర్పంచులను బిచ్చగాళ్లను చేసిందని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయాలి.. అలాంటి ప్రయత్నం చేయకపోగా...

Published : 04 Oct 2022 05:26 IST

ఈనాడు-అమరావతి: జగన్‌ ప్రభుత్వం సర్పంచులను బిచ్చగాళ్లను చేసిందని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయాలి.. అలాంటి ప్రయత్నం చేయకపోగా...కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలకు విడుదల చేసిన నిధులను కూడా దారి మళ్లించింది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలను మరింత బలహీనపరిచింది. కేంద్ర ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేటాయించాలి’ అని తులసిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts