విజయ్‌ ఇంట్లో పోలీసుల ప్రవర్తన మానవ హక్కుల ఉల్లంఘనే

ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా వారి పనితీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. గోడలు దూకడం, బలవంతంగా ఇళ్లలోకి చొరబడటం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం నిత్యకృత్యమైందని ఆరోపించారు.

Published : 04 Oct 2022 05:26 IST

రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా వారి పనితీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. గోడలు దూకడం, బలవంతంగా ఇళ్లలోకి చొరబడటం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం నిత్యకృత్యమైందని ఆరోపించారు. చింతకాయల విజయ్‌ వ్యవహారంలో సీఐడీ పోలీసుల తీరుపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి సోమవారం ఆయన లేఖ రాశారు. ‘‘డీకే బసు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌, అర్నేష్‌కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌, తదితర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ సీఐడీ పోలీసులు ఉల్లంఘించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. హైదరాబాద్‌లోని విజయ్‌ ఇంట్లో వారు ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరం. అది మానవ హక్కుల ఉల్లంఘనే. నిజంగా 41ఏ నోటీసు ఇవ్వడానికి వెళితే ఇంట్లో కప్‌బోర్డులు, షెల్ఫ్‌ల్లో ఎందుకు వెతికారు. విజయ్‌ డ్రైవర్‌ చంద్రపై ఎందుకు దాడి చేశారు? అయిదేళ్ల పిల్లాడిని ప్రశ్నించాల్సిన అవసరం ఏంటి? గుర్తింపుకార్డులు ఎందుకు ధరించలేదు? సివిల్‌ దుస్తుల్లో వెళ్లి ఏం నిరూపించాలనుకున్నారు?...’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన కోరారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని