రైతుల పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రపతి పాలన ఖాయం: రఘురామకృష్ణరాజు

న్యాయస్థానం అనుమతితో శాంతియుతంగా సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రను అల్లర్ల ద్వారా అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 04 Oct 2022 05:26 IST

ఈనాడు, దిల్లీ: న్యాయస్థానం అనుమతితో శాంతియుతంగా సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రను అల్లర్ల ద్వారా అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పాదయాత్రమీద దాడులకు దిగితే పోలీసు వ్యవస్థపై, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుంది. రైతుల పాదయాత్రను న్యాయస్థానాలు, కేంద్రం, రాష్ట్రపతి భవన్‌ ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఉన్నాయి. మంత్రివర్గం ఆమోదించిన రాజధానిని హైకోర్టు తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే రాలేదు. సుప్రీంకోర్టులో కేసు అసలు లిస్టే కానప్పుడు మంత్రులు మాట్లాడకూడదు...’ అని రఘురామ పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలపై తాను రాసిన లేఖపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను పేర్కొంటూ సమాధానం అందిందన్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిందని రఘురామ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని