ఎన్టీఆర్‌ పేరు కొనసాగించకపోతే ఉద్యమమే

విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని తెదేపా నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలా కొనసాగించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Published : 04 Oct 2022 05:38 IST

తెదేపా నాయకుల స్పష్టీకరణ

దాచేపల్లి, న్యూస్‌టుడే: విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని తెదేపా నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలా కొనసాగించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో సోమవారం నారాయణపురం బంగ్లా కూడలి ప్రాంతం నుంచి కేసానపల్లి అడ్డరోడ్డు వరకు నల్లరిబ్బన్లు ధరించి ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. శిబిరంలో పలువురు నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేసి దివంగత వైఎస్‌ పేరు పెట్టుకోవాలని సీఎం జగన్‌కు సూచించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తెదేపా నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts