Narayanaswamy: ‘మీ రెడ్లు అందరూ ఇట్లానే మాట్లాడతారా?’

‘మీ రెడ్లు అందరూ ఇలానే మాట్లాడతారా? మిమ్మల్ని ఎవరో ఉసిగొల్పి పంపినట్లు ఉన్నారు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు’ అంటూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విశ్రాంత ఎంఈవో, న్యాయవాది మోహన్‌రామిరెడ్డిపై అసహనం వ్యక్తంచేశారు.

Updated : 05 Oct 2022 08:24 IST

డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్య

పెనుమూరు, న్యూస్‌టుడే: ‘మీ రెడ్లు అందరూ ఇలానే మాట్లాడతారా? మిమ్మల్ని ఎవరో ఉసిగొల్పి పంపినట్లు ఉన్నారు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు’ అంటూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విశ్రాంత ఎంఈవో, న్యాయవాది మోహన్‌రామిరెడ్డిపై అసహనం వ్యక్తంచేశారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా మంగళవారం నారాయణస్వామి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లెలో పర్యటించారు. ఆ సమయంలో మోహన్‌రామిరెడ్డి ఉపముఖ్యమంత్రి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పే ప్రయత్నం చేశారు.

‘మా విద్యుత్తు ఉపకేంద్రంలో ఏఈ, సిబ్బంది కొరత ఉంది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంద’న్నారు. వెంటనే డిప్యూటీ సీఎం స్పందిస్తూ ‘మీరట్లా మాట్లాడకండి. రెడ్లు అందరూ ఇలాగే మాట్లాడతారా’ అంటూ మండిపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం సాగింది. ఎస్సై అనిల్‌కుమార్‌ జోక్యం చేసుకుని రామిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎస్సైకి, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం, ఎస్సైపై రామిరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సిబ్బంది తీసుకునేందుకు తిరస్కరించారు. తనను వారు అనవసరంగా దూషించారని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని