సీఐడీ పోలీసులపై చర్యలు తీసుకోవాలి

తెదేపా నాయకుడు చింతకాయల విజయ్‌ ఇంటిలోకి అక్రమంగా చొరబడి ఆయన రెండేళ్ల, ఐదేళ్ల కుమార్తెలను...

Updated : 05 Oct 2022 05:28 IST

తెలంగాణ బాలల హక్కుల కమిషన్‌కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ

ఈనాడు, అమరావతి: తెదేపా నాయకుడు చింతకాయల విజయ్‌ ఇంటిలోకి అక్రమంగా చొరబడి ఆయన రెండేళ్ల, ఐదేళ్ల కుమార్తెలను... ‘మీ నాన్న ఎక్కడని’ పదేపదే ప్రశ్నించి భయభ్రాంతులకు, మానసిక వేధింపులకు గురి చేసిన ఏపీ సీఐడీ పోలీసులుగా చెబుతున్న నలుగురి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలంగాణ బాలల హక్కుల కమిషన్‌కు మంగళవారం లేఖ రాశారు. ‘హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసుల వికృత చేష్టలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చింతకాయల విజయ్‌ ఇంటిలోకి బలవంతంగా సివిల్‌ డ్రెస్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. విజయ్‌ డ్రైవర్‌ను కొట్టారు. షెల్ఫ్‌లు, కప్‌బోర్డులు తెరిచి వస్తువులను చెల్లాచెదురు చేశారు. ఆ నలుగురూ ఏపీ సీఐడీ పోలీసులని సమాచారం. పిల్లల ఫొటోలను తీసుకెళ్లారు. వారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏపీ సీఐడీ పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలి...’ అని కమిషన్‌కు ఆ లేఖలో వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని