కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉపఎన్నిక నిర్వహించాలి

మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉప ఎన్నిక నిర్వహించాలని భాజపా.. ఎన్నికల సంఘాన్ని కోరింది.

Published : 05 Oct 2022 05:40 IST

ఎన్నికల సంఘానికి భాజపా వినతిపత్రం

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉప ఎన్నిక నిర్వహించాలని భాజపా.. ఎన్నికల సంఘాన్ని కోరింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉప ఎన్నిక దృష్ట్యా పార్టీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ‘‘ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పోలీసు వాహనాలు, అంబులెన్స్‌ల ద్వారా డబ్బు తరలించే అవకాశం ఉంది. అడ్డుకట్ట వేయాలంటే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలి’’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, డాక్టర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి,  కె.ఆంథోనిరెడ్డి, సోమంచి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని