బీసీలకు అండగా తెరాస: మంత్రి కేటీఆర్‌

ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలా అండగా ఉందని, వారి అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు.

Updated : 05 Oct 2022 06:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలా అండగా ఉందని, వారి అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. తెలంగాణ బీసీ సంఘాల ఐకాస ఛైర్మన్‌, పీసీసీ అధికార ప్రతినిధి  ఓరుగంటి వెంకటేశంగౌడ్‌, ఇతర నేతలు కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, సబ్బండవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విపక్ష పార్టీలు బీసీలను ఓటుబ్యాంకుగా భావిస్తుండగా వారిని తెరాస ఆత్మబంధువుల్లా భావిస్తూ ఆదుకుంటోందన్నారు. వెంకటేశంగౌడ్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌ నాయకత్వంలో  సామాజిక న్యాయం జరుగుతోందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని