కేసీఆర్‌ని ఏపీ ప్రజలు స్వాగతించరు: అశోక్‌బాబు

‘కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టారేమో గానీ.. ఆయనలో జాతీయత, నిజాయతీ లేవు. కేసీఆర్‌ని ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుందేమో గానీ... ఆంధ్రప్రదేశ్‌ స్వాగతించదు’ అని తెదేపా ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.

Published : 07 Oct 2022 02:28 IST

ఈనాడు, అమరావతి: ‘కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టారేమో గానీ.. ఆయనలో జాతీయత, నిజాయతీ లేవు. కేసీఆర్‌ని ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుందేమో గానీ... ఆంధ్రప్రదేశ్‌ స్వాగతించదు’ అని తెదేపా ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి, ఆర్థికంగా దెబ్బతీయడమే కాక, నవ్యాంధ్రను ద్వితీయశ్రేణి రాష్ట్రం అన్నారని, అందువల్ల ఆయన్ను ఇక్కడి ప్రజలు గౌరవించరని చెప్పారు. ఉడతకు పులి అని పేరు పెడితే అది పులి అయిపోదని, జాతీయపార్టీగా మారే అవకాశం ఉన్నంత మాత్రాన అది జాతీయపార్టీ కాదని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్‌లో జాతీయవాదం ఉందో, లేదో కానీ.. నిజాయతీ మాత్రం లేదని కాంగ్రెస్‌ని మోసం చేయడం ద్వారా రుజువైంది. తెలంగాణ ఇస్తే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి కుటుంబసభ్యులతో కలిసి సోనియాగాంధీతో ఫొటో దిగి బయటకొచ్చి ఏం చేశారో అందరికీ తెలుసు. తెలంగాణ వస్తే దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్‌ తానే సీఎం అవ్వలేదా? కుమారస్వామి సహా ఏ ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌లో విలీనానికి అంగీకరించనప్పుడు అది జాతీయపార్టీ ఎలా అవుతుంది? కొత్త పార్టీలు కలిస్తేనే ప్రాధాన్యం ఉంటుంది. అది బీఆర్‌ఎస్‌ ఆవిర్భావంలో కనిపించలేదు’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని