బీఆర్ఎస్తో ఒరిగేదేమీ లేదు: గోరంట్ల
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను కేసీఆర్ జాతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ప్రకటించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను కేసీఆర్ జాతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ప్రకటించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. ‘జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు గానీ... గుర్తింపు రావాలంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న బలం, సాధించిన ఓట్లు శాతాన్ని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది. కేసీఆర్‌కు కొన్ని రాష్ట్రాల్లో భాజపాతో పొత్తు, మరికొన్నిచోట్ల కాంగ్రెస్‌తో పొత్తు ఎలా కుదురుతుందో అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి స్థానం లేదు. రాష్ట్ర విభజన, సీమాంధ్ర ప్రజల ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనుగడ కష్టం...’ అని పేర్కొన్నారు. ఆంధ్రాకు వచ్చి తెదేపాకు వ్యతిరేకంగా మాట్లాడితేనే తాము స్పందిస్తామని, అంత వరకూ ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణలో మునుగోడు ఎన్నికలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచి ముందు బయటపడాల్సి ఉందన్నారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టారని, ఇప్పుడు ఆ అవసరం లేదు కనుక పార్టీ పేరు మార్చేశారని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా గోరంట్ల చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!