రాష్ట్రంలో ప్రతిపక్షంగానే బీఆర్‌ఎస్‌ పార్టీ

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే బీఆర్‌ఎస్‌ కూడా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం విజయనగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 07 Oct 2022 03:34 IST

మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే బీఆర్‌ఎస్‌ కూడా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం విజయనగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం అధికార పార్టీపై ప్రతిపక్షాల ప్రభావం ఎలా ఉందో? బీఆర్‌ఎస్‌దీ అలానే ఉంటుంది. జాతీయస్థాయిలో ఇప్పుడున్న పార్టీల్లో ఇదో ప్లస్‌వన్‌ మాత్రమే. రాజకీయాల్లో పోటీ ఉంటేనే బాగుంటుంది...’ అని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖకు ఏ సమయంలోనైనా, ఏ రోజైనా రాజధానిని తీసుకొస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని తామెప్పుడూ చెప్పలేదని, అటువంటి ప్రయత్నాలు చేయలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా ఉన్న అశోక్‌గజపతిరాజు, కళా వెంకటరావు ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలోనూ మంత్రిగా వ్యవహరించిన అశోక్‌గజపతిరాజు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయిదేళ్లలో తోటపల్లి ప్రాజెక్టుకు పిల్ల కాలువలు తవ్వించలేకపోయారని ఎద్దేవా చేశారు. కనీసం విజయనగరంలో రోడ్లు విస్తరణ కూడా చేయకపోవడం దౌర్భాగ్యమని మంత్రి బొత్స పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని