తెరాసదే విజయం

మునుగోడు ఉప ఎన్నికలో తెరాస గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, సర్వేలన్నీ ఇదే చెబుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. పార్టీ అభ్యర్థికి 50 శాతం ఓట్లు వస్తాయని, మిగిలిన 50 శాతంలో రెండు, మూడు స్థానాలు ఎవరికి వస్తాయో  భాజపా, కాంగ్రెస్‌ తేల్చుకుంటాయన్నారు.

Published : 07 Oct 2022 04:52 IST

50 శాతానికి పైగా ఓట్లు వస్తాయి

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో తెరాస గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, సర్వేలన్నీ ఇదే చెబుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. పార్టీ అభ్యర్థికి 50 శాతం ఓట్లు వస్తాయని, మిగిలిన 50 శాతంలో రెండు, మూడు స్థానాలు ఎవరికి వస్తాయో  భాజపా, కాంగ్రెస్‌ తేల్చుకుంటాయన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో సమావేశం అనంతరం ప్రగతిభవన్‌కు వెళ్లిన సీఎంను..మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు అక్కడే కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటి నుంచి తెరాసలో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని, భారాసను ఆహ్వానిస్తూ  ఊరూరా సంబురాలు జరుపుకొంటున్నారన్నారు. అక్కడ తెరాస గ్రాఫ్‌ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. పార్టీ నేతలంతా ఎవరికి అప్పగించిన పని వారు చేస్తే ఊహించిన స్థాయిలో విజయం సాధించడం కష్టమేమీ కాదని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని